మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Vyasa Krita Dakshinamurthy Ashtakam – శ్రీ దక్షిణామూర్త్యష్టకమ్ (వ్యాస కృతం)

శ్రీవ్యాస ఉవాచ –
శ్రీమద్గురో నిఖిలవేదశిరోనిగూఢ
బ్రహ్మాత్మబోధ సుఖసాంద్రతనో మహాత్మన్ |
శ్రీకాంతవాక్పతి ముఖాఖిలదేవసంఘ
స్వాత్మావబోధక పరేశ నమో నమస్తే || 1 ||

సాన్నిధ్యమాత్రముపలభ్యసమస్తమేత-
దాభాతి యస్య జగదత్ర చరాచరం చ |
చిన్మాత్రతాం నిజ కరాంగుళి ముద్రయా య-
స్స్వస్యానిశం వదతి నాథ నమో నమస్తే || 2 ||

జీవేశ్వరాద్యఖిలమత్ర వికారజాతం
జాతం యతస్స్థితమనంతసుఖే చ యస్మిన్ |
యేనోపసంహృతమఖండచిదేకశక్త్యా
స్వాభిన్నయైవ జగదీశ నమో నమస్తే || 3 ||

యస్స్వాంశజీవసుఖ దుఃఖ ఫలోపభోగ-
హేతోర్వపూంషి వివిధాని చ భౌతికాని |
నిర్మాయ తత్ర విశతా కరణైస్సహాన్తే
జీవేన సాక్ష్యమత ఏవ నమో నమస్తే || 4 ||

హృత్పుండరీకగతచిన్మణిమాత్మరూపం
యస్మిన్ సమర్పయతి యోగబలేన విద్వాన్ |
యః పూర్ణబోధసుఖలక్షణ ఏకరూప
ఆకాశవద్విభురుమేశ నమో నమస్తే || 5 ||

యన్మాయయా హరిహర ద్రుహిణా బభూవు-
స్సృష్ట్యాదికారిణ ఇమే జగతామధీశాః |
యద్విద్యయైవ పరయాత్రహి వశ్యమాయా
స్థైర్యం గతా గురువరేశ నమో నమస్తే || 6 ||

స్త్రీపుంనపుంసకసమాహ్వయ లింగహీనో-
ఽప్యాస్తేత్రిలింగక ఉమేశతయా య ఏవ |
సత్యప్రబోధ సుఖరూపతయా త్వరూప-
వత్త్వే న చ త్రిజగతీశ నమో నమస్తే || 7 ||

జీవత్రయం భ్రమతి వై యదవిద్యయైవ
సంసారచక్ర ఇహ దుస్తరదుఃఖ హేతౌ |
యద్విద్యయైవ నిజబోధరతం స్వవశ్యా
విద్యం చ తద్భవతి సాంబ నమో నమస్తే || 8 ||

ఇతి శ్రీగురుజ్ఞానవాసిష్ఠజ్ఞానకాండస్య ద్వితీయపాదే ప్రథమాధ్యాయే శ్రీవ్యాసకృత దక్షిణామూర్త్యష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.